తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో గడ్డిని తరలిస్తున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు అంటుకున్నాయి. యజమాని వీర్రాజు చాకచక్యంగా వ్యవహరించి ట్రాక్టర్ను కాపాడుకున్నాడు. గండేపల్లి మండలం మురారి గ్రామంలోని కాకర వీర్రాజుకు చెందిన గడ్డి ట్రాక్టర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలలో చిక్కుకొంది. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
వీర్రాజు జేసీబీ సహాయంతో గడ్డిని కిందకు పడేసి..ట్రాక్టర్కు మంటలు అంటుకోకుండా ముందుకు నడిపాడు. ప్రమాదం నుంచి ట్రాక్టర్ను కాపాడుకున్నాడు.
ఇదీ చూడండి. కడపలో రూ.3కోట్లు విలువైన ఎర్రచందనం దుంగలు పట్టివేత