ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరు మురుగు కాలువల్లోకి చేరి వాటికి అనుసంధానంగా ఉన్న అవుట్ ఫాల్స్ స్లూయిజ్ ద్వారాా ముంపు నీరు గోదావరి నది పాయలో కలుస్తోంది. కోనసీమలో గోరింకల, అప్పర్ కౌశిక్, లోయర్ కౌశిక్ దేశికుడు, దసరా బుల్లోడు వంటి ప్రధాన మురుగు కాలువలు... వాటికి అనుబంధంగా మధ్య, చిన్న తరహా రెవెన్యూ మురుగు కాలువలు ఉన్నాయి. అధిక వర్షాలకు ఈ మురుగు కాలువలు అన్నీ పోటెత్తి జోరుగా ప్రవహిస్తున్నాయి.
ఇదీ చదవండి: వాతావరణం: బలపడనున్న అల్పపీడనం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు