తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో దారుణం చోటు చేసుకుంది. ఓ రైతుని చెట్టుకి కట్టేసి ఏడుగురు రైతులు విచక్షణారహితంగా కొట్టడం తీవ్ర సంచలనం కలిగించింది. రైతు శ్రీనివాస్‌రెడ్డి, మిగతా రైతుల మధ్య భూవివాదం ఉంది. తరచూ బాధిత రైతు, మిగతా రైతుల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం తీవ్ర వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం శ్రీనివాస్‌రెడ్డి పొలంలో ఉండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు చెట్టుకు కట్టేసి శ్రీనివాస్‌రెడ్డిని తీవ్రంగా కొట్టారు. శరీరమంతా గాయపర్చారు. సమాచారం అందుకున్న జగ్గంపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుడికి స్థానికంగా ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం కాకినాడకు తరలించారు. ఈ వ్యవహారంపై జగ్గంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి
రాజధానిపై ఎన్నికలకు వెళ్దాం.... 48 గంటల్లో తేల్చండి: చంద్రబాబు