కరోన మహమ్మారి వలన పనులు లేని నిరుపేదలు ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా ఉండాలని ప్రభుత్వం రెండో విడత రేషన్ పంపిణీ చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుండి లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు చేరుకున్నారు. నిత్యావసర సరకులు కొలతల్లో తేడాలు రాకుండా, ప్రజలు భౌతిక దూరం పాటించే విధంగా రేషన్ డీలర్లు చూడాలని అధికారులు సూచిస్తున్నారు. ఆలమూరు తహశీల్దార్ జవ్వాది వెంకటేశ్వరి, ఎస్సై వి.సుభాకర్ సమక్షంలో తన సిబ్బందితో సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. చెముడులంకలో సర్వర్ పని చేయకపోవడంతో ప్రజలు నిలబడలేక వరుస క్రమంలో తాము తీసుకొచ్చిన సంచులను పెట్టి ఇంటికి వెళ్లారు.
ఇది చూడండి కోనసీమలో కనువిందు చేస్తున్న మంచు అందాలు