ETV Bharat / state

'ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మా ప్రాథమిక హక్కు'

ఎస్సీ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నిరసన తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.

SC Welfare Association
ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నిరసన
author img

By

Published : Feb 23, 2020, 12:56 PM IST

ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నిరసన

ఎస్సీ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని మూడు రహదారుల కూడలి వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా టైర్లు కాల్చి నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు అని నినాదాలు చేశారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, ఎం సుధాకర్, జి.ఆనందరావు, సీహెచ్ రాంబాబు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

కవలల దినోత్సవం: ఈ రూపం... అపురూపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.