తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజుల పాటు సాగే ఈ పండుగలో ఆచార సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లుగా ప్రతిబంబిస్తాయి. అందులో భాగంగా భోగి నాడు వేసే మంటల కోసం ఆవు పేడతో తయారు చేసిన పిడకల దండలను తయారు చేసేందుకు ప్రజలు పోటీ పడతారు. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో బుచ్చమ్మ అగ్రహారానికి చెందిన 20 కుటుంబాలు.. 280 అడుగుల పొడవు గల భోగి పిడకల దండలు తయారు చేసి ఔరా అనిపించారు. వీటి కోసం 15 రోజుల నుంచి ఆవు పేడను సేకరించినట్లు పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు.. సంక్రాంతి పర్వదినం విశిష్టతను పిల్లలకు తెలియజేయాలనే ఆశయంతో.. మహిళలు ఏకమై తయారు చేసినట్లు తెలిపారు. వీటిని భోగి రోజున ఈ దండను భోగిమంటల్లో వేసేందుకు సిద్ధం చేశారు.
ఇదీ చదవండి: ధవళేశ్వరం జలవనరుల శాఖ ఉద్యోగి ఇంట్లో అనిశా సోదాలు