ETV Bharat / state

పల్లె సంప్రదాయం ఉట్టిపడేలా ముందస్తు సంక్రాంతి వేడుకలు

author img

By

Published : Jan 12, 2020, 4:15 PM IST

రాష్ట్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాభరణాలతో.. విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. సంప్రదాయం ప్రతిబింబించేలా... విద్యార్థులు రూపొందించిన పల్లె వాతావరణ నమూనాలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నల ఆటలు ఆకట్టుకున్నాయి.

Sankranthi celebrations
పల్లె సంప్రదాయం ఉట్టిపడేలా...ముందస్తు సంక్రాంతి వేడుకలు

రాష్ట్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు కళాశాల ప్రాంగణాలను తెలుగుదనం ఉట్టిపడేలా రంగవల్లులతో అలంకరించారు.

విశాఖ జిల్లా

విశాఖలో కేబుల్ ప్రసారాల అగ్రగామి వాజి కమ్యూనికేషన్ సంస్థ ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించింది. ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా మైదానంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. విశాఖ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్​డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాసరావులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లాలో సంక్రాతి శోభ ముందుగానే వచ్చింది. స్థానిక లెంథీ ఇంజినీరింగ్​ కళాశాలలో పండుగ ముందస్తు వేడుకలు వైభవంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణాన్ని అందమైన రంగవల్లులతో అలంకరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇదీ చదవండి:

పాఠశాలల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.