ETV Bharat / state

పేరుకుపోయిన బకాయిలు... నిలిచిన ఇసుక వెలికితీత - పేరుకుపోయిన బకాయిలు...నిలిచిన ఇసుక వెలికితీత

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రేవుల నిర్వాహణ బకాయిలు పేరుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 10 కోట్ల రూపాయలపైనే చెల్లింపులు నిలిచిపోవడంతో ఇసుక రేవుల సొసైటీ నిర్వాహకులు, జట్టు కూలీలు, వాహన నిర్వాహకులు ఉపాధి కోల్పోతున్నారు. కొన్ని సొసైటీలు ఇసుక ఉత్పత్తి తగ్గించేస్తుండగా... మరికొన్ని మాత్రం మూసేస్తున్నారు.

పేరుకుపోయిన బకాయిలు...నిలిచిన ఇసుక వెలికితీత !

author img

By

Published : Jul 6, 2020, 1:02 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో డీసిల్టింగ్, బోట్​మెన్ సొసైటీ, ఓపెన్ రీచ్​లు కలిపి 50 వరకూ ఇసుక రేవులు నడుస్తున్నాయి. వీటిలో ప్రతి సొసైటీలో 40 నుంచి 50 మంది జట్టు కూలీలు పనిచేస్తుంటారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో ఉన్న 8 రేవులు బోట్స్​మన్ సొసైటీల ఆధ్వర్యంలో ఇసుక ఉత్పత్తి చేస్తుంటాయి. నిత్యం వందల మంది కూలీలు గోదావరిలో మునిగి పడవల ద్వారా ఇసుక ఒడ్డుకు చేరుస్తారు. రెండు యూనిట్ల ఇసుక ఉత్పత్తి చేస్తే కూలీల వేతనాలు, పడవ డీజిల్ ఖర్చులు, నిర్వహణ కలిపి 1800 వరకు సొసైటీలకు చెల్లిస్తారు.

ఇసుక రవాణా చేసే లారీలకు కిలోమీటర్​కు 8 రూపాయలు చొప్పున చెల్లిస్తారు. వినియోగదారుల నుంచి ఆన్​లైన్​లో నగదు వసూలు చేస్తున్న ఏపీఎండీసీ... సొసైటీలు, లారీల యజమానులు, డ్రైవర్లకు నలభై రోజులుగా చెల్లింపులు ఆపేసింది. రోజుల తరబడి డబ్బులు చెల్లించక పోవడంతో రాజమహేంద్రవరం డివిజన్​లోనే పెద్దదైన కోటిలింగాల-1 రేవును మూసేశారు. మిగతా వారూ ఇసుక ఉత్పత్తి తగ్గించేయగా....మరి కొన్ని మూసి వేసే దిశగా సాగుతున్నాయి. దీంతో రేవులపై ఆధారపడ్డ వారి ఉపాధికి గండి పడుతోంది.

జిల్లాలో 10 కోట్లపైనే ఇసుక రేవులకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. భారీగా వరద వస్తే ఇసుక తవ్వకాలు నిలిపి వేయాల్సి ఉంటుంది. మరోవైపు నది ఒడ్డునే ఉన్నా రాజమహేంద్రవరంలో వినియోగదారులకుసైతం సకాలంలో ఇసుక అందడం లేదు. ఈ పరిస్థితిలో రేవుల్లో వేగంగా ఇసుక తవ్వకాలకు ఆయా ప్రభుత్వ శాఖలు సహకరించాల్సి ఉంది. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. పరిస్థితిని గమనించి తక్షణం బకాయిలు విడుదుల చేయాలని ఇసుక రేవుల నిరాహకులు, కూలీలు డిమాండ్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.