తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవీన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ,ధన్యతలు సైకత శిల్పాన్ని రూపొందించారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సేవ్ గర్ల్స్ నినాదంతో వారు ఈ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు.
సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అనర్థాల నుంచి ఆడపిల్లలను కాపాడమని.. గర్భంలోని శిశువు.. అమ్మవారిని వేడుకుంటున్నట్టు ఈ సైకత శిల్పాన్ని మలిచారు. అందరిని ఆలోచింపజేసేలా మలచిన శిల్పాన్ని చూసేందుకు.. జనం తరలి వస్తున్నారు.
ఇదీ చదవండి: