తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని మారుతి సెంటర్ కనకదుర్గమ్మ అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పవిత్ర ఆషాఢమాస శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ అద్వర్యంలో అర్చకులు అమ్మవారిని 58 రకాల కూరగాయలు, వివిధ రకాల పండ్లతో సుందరంగా అలంకరించారు.
ఆలయం అంతా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు, ఆలయ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని.. ఆలయ కమిటీ అర్చకులు పుల్లేటికుర్తి కృష్ణ శర్మ, యలమంచిలి వీర ప్రసాద శర్మలు తెలిపారు.
ఇదీ చదవండి: