ETV Bharat / state

తీవ్ర నష్టాల్లో కోనసీమ ఆర్టీసీ

లాక్​డౌన్ ముందు వరకు లాభాల్లో ఉన్న కోనసీమ ఆర్టీసీ.... ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోంది. రోజుకు 132 ఆర్టీసీ బస్సులు నడిచే ఈ డిపోలో ఇప్పుడు 32 మాత్రమే రాకపోకలు చేస్తున్నాయని అమలాపురం ఆర్టిసి డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ తెలిపారు.

rtc is in loss in konaseema depot at east godavari
నష్టాల్లో నడుస్తున్న కోనసీమ ఆర్టీసీ
author img

By

Published : Aug 11, 2020, 6:55 PM IST

లాక్​డౌన్​ సడలింపులతో రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ... ఆర్టీసీ మాత్రం నష్టాల్లో కొొట్టుమిట్టాడుతోంది. లాక్​డౌన్ ముందు వరకు లాభాల్లో ఉన్న కోనసీమ ఆర్టీసీ.... ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోంది. అమలాపురం , రావులపాలెం , రాజోలు డిపోల నుంచి రోజుకు 267 బస్సులు తిరిగేవి... కానీ ఇప్పుడు 60 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి.

132 బస్సులు నడిచే అమలాపురం డిపో నుంచి కేవలం 32 బస్సులు మాత్రమే ప్రయాణిస్తున్నాయని డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ తెలిపారు. ఈ డిపోలో నెలకు రూ.3.50 కోట్ల నష్టం వస్తోందని వెల్లడించారు. రోజుకు 15 వేల మంది ప్రయాణికులు రాకపోకలు చేసేవారని.. ఇపుడు 1500 మంది ప్రయాణికులు కూడా రావడంలేదని తెలిపారు. పాలెం, రాజోలు డిపోల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు.

ఇదీ చదవండి:

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సంతాపం: రమేష్ ఆసుపత్రి యాజమాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.