ETV Bharat / state

ఆర్టీసీ బస్సు- లారీ ఢీ.. బస్సు డ్రైవర్​కు తీవ్రగాయాలు - road accidents in east godavari

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ మూల మలుపు వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి.​ క్యాబిన్​లో ఇరక్కుపోయిన బస్సు డ్రైవర్ కాళ్లు విరిగిపోయాయి. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

accident at jonnada east godavari
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ
author img

By

Published : Apr 29, 2021, 1:26 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కాళ్లు విరిగిపోయాయి. రావులపాలెం డిపోకు చెందిన బస్సు కాకినాడ నుంచి రావులపాలెం వస్తుండగా ఆలమూరు మండలం జొన్నాడ మలుపు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న లారీని బస్సును బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆర్టీసీ డ్రైవర్ ఎం.ఎస్ నారాయణ క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. స్థానికులు, పోలీసులు జేసీబి సాయంతో అతనిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో నారాయణ రెండు కాళ్లు పూర్తిగా విరిగి పోయాయి. 108 అంబులెన్స్​లో ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి అతణ్ని తరలించారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ఇదీ చదవండి:

దారుణం: మూడేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తల్లి

సైకిల్‌పై భార్య శవం.. దిక్కుతోచని స్థితిలో భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.