ETV Bharat / state

కనుమ రోజూ జోరుగా- తగ్గేదే లేదన్న పందెం రాయుళ్లు - kanuma

Rooster Fights and Gambling in Andhra Pradesh: కోడి పందేల జోరు కనుమ పండగ రోజూ కొనసాగింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బరుల్లో పందెం రాయుళ్లు తగ్గేదే లేదంటూ రెచ్చిపోయారు. మూడో రోజు కోట్ల రూపాయలు చేతులు మారాయి.

Rooster_Fights_and_Gambling_in_Andhra_Pradesh

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 10:05 PM IST

Rooster Fights and Gambling in Andhra Pradesh: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో కోడిపందాలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో భారీగా బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్లు, కోడి పందేలు చూసేందుకు వచ్చిన జనంతో బరుల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గెలుపు నీదా నాదా అంటూ పెద్ద మొత్తంలో పందేలు కాశారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంప్రదాయ క్రీడలతో పల్లెలు కోలాహలంగా ఉన్నాయి. జిల్లాలో కోడి పందాలు యథేచ్ఛగా సాగాయి. పలుచోట్ల భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్లతో కోడి పందేల బిరులు కిటకిటలాడాయి. తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం వేల్పూరు గ్రామాల్లో పందేలు నిర్వహించారు. కోడిపందాలతోపాటు గుండాట, ఇతర జూద క్రీడలు నిర్వహించారు.

ఊపందుకున్న కోడి పందేలు - చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

ఏలూరు శివారు కోడెలు, కొమరవోలు, జాలిపూడి, మాదేపల్లి, పాలగుడెం, చాటపర్రు, చోదిమెళ్లలో కోడిపందాలు జరిగాయి. కోడి పందాలతోపాటు బరుల వద్ద గుండాట శిబిరాలను ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున డబ్బులు చేతులుమారాయి. నిర్వాహకులు బరుల వద్ద బౌన్సర్లును, ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మద్యం ఏరులై పారింది. గత రెండు రోజులుగా కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడిపందాలు జరగకుండా అడ్డుకుంటామని చెప్పిన పోలీసులు జాడ కనిపించకపోగా, ప్రభుత్వ అధికారులు నియమించిన గ్రామ కమిటీలు, వలంటీర్ల సైతం పత్తాలేకుండా పోయారు.

తూర్పు గోదావరి జిల్లాలోనూ మూడో రోజు కోడి పందాలు, గుండాటలు జోరుగా జరిగాయి. గడిచిన రెండు రోజులుగా జోరుగా జరిగిన కోడి పందాలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో మూడో రోజు తెల్లవారకముందే పందెం రాయుళ్లు బరులకు పరుగులు తీశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం, సూర్యారావు పాలెం, నిడదవోలు మండలం డి ముప్పవరం తదితర గ్రామాలలో జోరుగా పందేలు నిర్వహించారు.

ఏపీలో జోరుగా కోడి పందేలు - కోట్ల రూపాయల బెట్టింగులతో సై అంటున్న ఆటగాళ్లు

పందెం రాయుళ్లు ఏడాది పాటు తాము పెంచుకున్న కోడి పుంజులతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరులలో దిగారు. ఉన్నంతలో కొంతమంది, అప్పులు చేసుకుని మరి కొంతమంది జేబుల్లో బరువును పెంచుకొని పందాలు కాశారు. గుండాట, ఇతర జూద క్రీడల వద్ద సైతం జనం భారీగా ఉన్నారు. పందెం రాయుళ్లు తాడో పేడో తేల్చుకునేందుకు భారీగా వచ్చారు. కాయ్ రాజా కాయ్ అంటూ నిర్వాహకులు సవాల్ విసిరితే ఆడేవారు సైతం అదే స్థాయిలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో గుండాట శిబిరాలను ఏర్పాటు చేశారు. గుండాటల వద్ద కాయ్ రాజా కాయ్ అంటూ ఆటగాళ్లను హుషారు ఎక్కించారు.

వారికి హైకోర్టు నిబంధనలు పట్టవ్ అంతే - జోరుగా కోడి పందేలు, గుండాట

కనుమ రోజూ జోరుగా - తగ్గేదే లేదన్న పందెం రాయుళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.