తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ మొబైల్ దుకాణంలో చోరీ(ROBBERY) జరిగింది. దుకాణం తలుపు తాళం పగలకొట్టి.. ఓ దొంగ లోనికి ప్రవేశించి సొత్తు అపహరించుకుపోయాడు. ఈ ఘటనలో రూ. 70 వేల నగదుతో పాటు మొత్తం రూ. 2 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైందని షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దొంగతనం జరిగిన సమయంలోని దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చేతికి గ్లౌజులు, మంకీ క్యాప్ ధరించిన నిందితుడు.. చోరీకి పాల్పడిన తీరును పోలీసులు అందులో గమనించారు. అతడిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై చోరీ జరిగిన ప్రదేశానికి చేరుకున్న క్లూస్ టీమ్ పలు ఆధారాలను సేకరించింది. చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు.
ఇవీ చదవండి:
UP: 'వృద్ధుడిపై దాడి' ఘటనపై రాజకీయ దుమారం
Maoist Couriers Arrest: ముగ్గురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్.. రూ. 9.73 లక్షలు పట్టివేత