ETV Bharat / state

రాష్ట్రపతి కార్యాలయం చొరవతో రహదారి పనులు

తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రహదారి మనీ అధ్యానంగా తయారైంది. అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా లాభం లేకపోయింది. దీంతో పట్టణానికి చెందిన బీఎన్‌ఎస్‌ఎన్‌ మూర్తి రోడ్డు దుస్థితిపై ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతికి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయం చొరవతో ఆ రహదారి పనులు మొదలు పెట్టారు.

రాష్ట్రపతి కార్యాలయం చొరవతో రహదారి పనులు
Road works on the initiative of the President's
author img

By

Published : Mar 27, 2021, 7:59 AM IST

రాష్ట్రపతి కార్యాలయం చొరవతో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రహదారి పనుల్లో కదలిక వచ్చింది. జిల్లాలోని మండపేట-ద్వారపూడి రహదారి మూడేళ్లుగా అధ్వానంగా ఉంది. గుంతల్లో పడి వాహనచోదకులు గాయాలపాలవుతున్నారు. దినపత్రికల్లో ఎన్ని కథనాలు వచ్చినా, అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన బీఎన్‌ఎస్‌ఎన్‌ మూర్తి రోడ్డు దుస్థితిపై ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతికి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

అనంతరం రాష్ట్రపతి కార్యాలయం అధికారులు ఫోనులో ఆయనను సంప్రదించి సమస్యను తెలుసుకున్నారు. ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యదర్శి ఎ.జనార్దనబాబుకు పంపించారు. ఆ మేరకు తనకు మెయిల్‌ వచ్చినట్లు మూర్తి వివరించారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు శుక్రవారం రహదారి మరమ్మతు పనులు ప్రారంభించారు.

ఇదీ చదవండి: తిరుపతి ఉపపోరు: కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.