తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం బూరుగు లంక వద్ద వశిష్ఠ గోదావరి అనుబంధ పాయలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో రహదారి తెగిపోయింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గురువారం రాత్రి ఈ ప్రదేశాన్ని పరిశీలించారు. ఇక్కడ రహదారి తెగిపోవడంతో ఉడుముండి లంక, అరిగెల వారి పేట, బూరుగు లంకజీ, పెదపూడి లంక ఇలా నాలుగు లంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు నెలకొన్నాయి. లంక గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే ఈ నదీ పాయలో మర పడవలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి కొత్తపల్లి, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కరోనా భయం