తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెం వద్ద జాతీయ రహదారిపై ఎడ్ల బండిని వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సీతానగరం మండలం రఘుదేవపురం నుంచి పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరకు ఎడ్ల బండిపై భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రఘుదేవపురానికి చెందిన పెద కాపు (55), నర్సాపురానికి చెందిన వీర వెంకటరావు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒక ఎద్దు చనిపోగా మరో ఎద్దు తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: