తూర్పుగోదావరి జిల్లా మన్యంలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వాగు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాజవొమ్మంగి మండలం జడ్డంగి వద్ద ఉన్న మడేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. అలాగే రాజవొమ్మంగి-ముర్లవానిపాలెం రహదారిలో ఉన్న కల్వర్టు వాగు వరద ఉధృతితో కొట్టుకుపోయింది. రంప చోడవరంలో వాడపల్లి వెళ్లే రహదారిలో కొండ వాగులు పొంగి ప్రవహించడం వల్ల రాకపోకలు స్తంభించాయి. ఆదివారం వారపు సంత కావడం వల్ల నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చూడండి...