వైద్యం ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని జనవరి ఒకటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 3నెలల పాటు లోటుపాట్లను పరిశీలించి దశలవారీగా అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చటమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
కాకినాడలో జిల్లా ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, పినిపే విశ్వరూప్ , వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. వైద్యుల కొరత, వైద్య పరికరాలు సరిగా లేకపోవటంతో పేదలకు ప్రభుత్వ వైద్యం అందటం లేదని స్థానిక నేతలు, సిబ్బంది తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో పడకలు పెంచటంతోపాటు, సమస్యలు పరిష్కరించాలని మంత్రికి, కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. అధికారులు ఇప్పటినుంచైనా ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువయ్యేలా చూడాలని సూచించారు.
ఇది కూడా చదవండి.