తీవ్ర అనారోగ్యం పాలై, నిలువ నీడలేని వృద్ధ దంపతుల దీనస్థితిపై ఈటీవీ-ఈనాడు, ఈటీవీ భారత్లు ప్రసారం చేసిన కథనాలకు విశేష స్పందన లభిస్తోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రవణమ్మకు సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. నాగరాజు, రవణమ్మ దంపతులు అన్యోన్యంగా జీవించారు. భార్య పక్షవాతానికి గురై కాలుచెయ్యి పడిపోవడంతో చూసే నాథుడు కరువై.. నగరంలోని ఫుట్‌పాత్ మీదే జీవనం సాగిస్తున్నారు. ఆమెకు భర్త నాగరాజు అన్నీ తానై సపర్యలు చేస్తున్నారు. వీరి దీనస్థితిపై ఈనాడు, ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చాయి. వృద్ధుల పరిస్థితికి తెలుసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఆయన అనుచరుణ్ని రాజమహేంద్రవరం పంపించి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. మరికొందరు దాతలు కూడా వీరికి సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జడ్జి బి.సాయి కల్యాణచక్రవర్తి కూడా స్పందించారు. వృద్ధులకు ఆధార్, పింఛన్, ఉండటానికి నివాసం ఏర్పాటు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.
భార్యషు దాసి కథనానికి స్పందన... దాతల సాయం..! - response for eenadu- etv and etv bharat stories latest news
వృద్ధాప్య తల్లిదండ్రులు చిన్న పిల్లలతో సమానం..ముదిమలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను కన్న బిడ్డలే గాలికొదిలేశారు. వారి దీనస్థితి ఈనాడు-ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనంతో దాతలు స్పందించి... వృద్ధులకు అండగా నిలిచారు.