ఉభయగోదావరి జిల్లాల ప్రజల 40ఏళ్ల కోరికను... ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చబోతున్నారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు పేర్కొన్నారు. సఖినేటిపల్లి-నరసాపురం వారధికి 400 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా సీతారామపురం రాజుల్లంక నుంచి తూర్పుగోదావరి జిల్లా రామేశ్వరం మీదుగా దిండి జాతీయ రహదారిని కలుపుతూ 23 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటి విడతగా 65 కోట్ల రూపాయలు భూమి సేకరణకు మంజూరు చేశారని ఎమ్మెల్యే రాపాక తెలిపారు. కొద్దిరోజుల్లో నూతన బ్రిడ్జ్‌కి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి...