తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని ఆర్టీసీ డిపో అధికారులు బస్సులకు మరమ్మతులు చేశారు. లాక్ డౌన్ కారణంగా.. 50 రోజులకు పైబడి బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగా.. గ్యారేజ్‌లో సిబ్బంది మరమ్మతులు చేశారు. గతంలో బస్సులో 56 మంది సిట్టింగ్ ఉండగా ప్రస్తుత 36 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
మాస్క్ ఉన్న వారికి మాత్రమే టికెట్ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ మాత్రమే ఉంటారని కండక్టర్ ఉండరని ఆర్టీసీ బస్టాండ్‌లో మాత్రమే టిక్కెట్లు విక్రయిస్తామని రావులపాలం ఆర్టీసీ డిపో మేనేజర్ అజిత కుమారి తెలిపారు.