నూతనంగా రేషన్ దుకాణాల వద్ద ప్రజలు రెండుసార్లు వేలిముద్ర వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రేషన్ డీలర్లు నిరసన తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట తహసీల్దార్ కార్యాలయాల వద్ద రేషన్ డీలర్లు ఈ-పాస్ యంత్రాలతో నిరసన వ్యక్తం చేశారు.
జిల్లాలో కరోనా వైరస్ కారణంగా పదుల సంఖ్యలో రేషన్ డీలర్లు మృతిచెందినా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు. 13 విడతల రేషన్ సరఫరాకు సంబంధించి తమకు రావాల్సిన కమీషన్ నేటికి విడుదల చేయలేదని పేర్కొన్నారు. కమీషన్ను వెంటనే విడుదల చేయాలని, రెండుసార్లు వేలిముద్ర వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డీలర్లు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:
ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేం : కొడాలి నాని