ETV Bharat / state

జీవోనెం 3ను పరిరక్షించాలని.. ఆదివాసీల నిరసన - go number 3 latest news

జీవో నెంబర్ 3ను పరిరక్షించాలని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో ఆదివాసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బంద్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు.

rampachodavaram tribles
జీవో 3ను పరిరక్షించాలని ఆదివాసీయుల నిరసన
author img

By

Published : Jun 18, 2020, 4:57 PM IST

ఆదివాసీలకు రక్షణగా ఉండే జీవో నెంబర్ 3ను పరిరక్షించాలని ఆదివాసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో బంద్ నిర్వహించారు. ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ కంగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఆదివాసీలు పెద్దఎత్తున బైఠాయించారు. ఈ ఆందోళనకు మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీఠంసెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబు రమేష్ హాజరై సంఘీభావం తెలిపారు. బైఠాయింపుతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఆదివాసీ హక్కుల వేదిక అధ్యక్షుడు బోండ్ల వరప్రసాదరావు, నాయకులు నిరంజని దేవి, చుక్క సంతోష్ కుమార్, రాజన్నదొర, పోడియం పండు, కడబాల రాంబాబు పాల్గొన్నారు.

ఇవీ చూడండి... 'రాష్ట్రస్థాయి పాల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.