తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని తన వాహనంలో ఆసుపత్రికి చేర్చారు. ఆలమూరు మండలం చింతలూరుకు చెందిన భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై మండపేటకు వెళ్లి వస్తుండగా.. గుమ్మివేరు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య తలకు బలమైన గాయం తగిలింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రామచంద్రాపురం డీఎస్పీ క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
ఇవీ చదవండి.. రాష్ట్రంలో లాక్‌డౌన్ మరింత పక్కాగా అమలు