నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల విద్యాధికారులు, ఇంజనీర్లతో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పట్టణ కో-ఆర్డినేటర్ శివ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. విద్యారంగంలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు చదువుకునే తరగతి గదులు, అవసరమైన తాగునీటి, వసతి, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా 35 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను 104 మందికి పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడటమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమన్నారు. ప్రజా సమస్యల సాధన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఇదీ చదవండి :