రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, నర్సులు నిరసనకు దిగారు. ఐసీఎమ్ఆర్ నిబంధనల ప్రకారం,వారం రోజుల కొవిడ్ డ్యూటీ తర్వాత.. మూడు రోజుల మాత్రమే సెలవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రాష్ట్ర వైద్యులు సమన్వయ అధికారి, అక్కడకు చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా వైద్యుల భర్తీ చేపట్టామనీ.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'కాకినాడలో పాలు దొరకవు కానీ మద్యం ఏరులై పారుతోంది'