ETV Bharat / state

రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం - దంచికొడుతున్న వర్షాలు

Rains in AP: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలకు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ప్రధాన రహదారులను సైతం వరద నీరు ముంచెత్తింది. అటు పంట పొలాలు దెబ్బతిని రైతులు ఆవేదన చెందుతున్నారు.

rains
rains
author img

By

Published : Oct 16, 2022, 10:19 PM IST

Updated : Oct 16, 2022, 10:47 PM IST

Rains in AP: రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ ముంపు బారిన పడింది. రైల్వే స్టేషన్ పట్టాలపైనా వరద పొంగింది. నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు కలెక్టరేట్‌ వాన నీరు ముంచెత్తింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారి.. మురుగు నీరు ఇళ్లలోకి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వానలకు చెరువులు నిండాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి. మరిన్ని కొన్ని రోజులు వానలు పడే అవకాశముందన్న అధికారుల హెచ్చరికలతో జనం ఆందోళన చెందుతున్నారు.

ఎగువన కురిసిన వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నదిలోకి భారీగా నీటిని వదిలారు. చల్లపల్లి మండలం అముదార్లంకలో సుమారు 20 నివాస గృహాలు నీటమునిగాయి, అధికారులు వరద సమాచారం ఇవ్వకపోవడం వల్ల.. సామాన్లు నీట మునిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో వాణిజ్య పంటలను వరద దెబ్బతీసింది. పసుపు, అరటి, కూరగాయలు, పూల తోటలు దెబ్బతిన్నాయి. బాపట్ల జిల్లా వేటపాలెం, చినగంజాంలో కురిసిన వానకు రోడ్లు జలమయమయ్యాయి. కారంచేడు మండలం దగ్గుబాడు వద్ద వాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది.

బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వానలకు వరి పంట చాలా వరకు దెబ్బతింది. కొన్ని చోట్ల నేలనంటిన వరి దుబ్బులను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అనంతపురంలో వరద ఉద్ధృతి తగ్గినా ప్రజల కష్టాలు తీరలేదు. యువజన కాలనీలోకి వెళ్లిన నగర మేయర్‌ను స్థానిక మహిళలు నిలదీశారు. ప్రభుత్వ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరికొద్దిరోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు

ఇవీ చదవండి:

Last Updated : Oct 16, 2022, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.