ETV Bharat / state

'మంత్రి గారూ.. తూర్పు, మధ్య డెల్టాకు మరిన్ని రోజులు నీళ్లు ఇప్పించండి' - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

తూర్పు డెల్టాకు ఏప్రిల్ 15 వరకు, మధ్య డెల్టాకు ఏప్రిల్ 20 వరకు సాగునీరు అందించాలని.. మంత్రి కురసాల కన్నబాబుకు నివేదిక ఇచ్చామని తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు తెలిపారు. చేలు పాలు పోసుకుంటున్న దశలో ఉన్న కారణంగా నీటి విడుదలను కొనసాగించాలని కోరినట్లు వెల్లడించారు.

rabi water extension at east and middle delta
డెల్టాకు మరిన్ని రోజులు నీళ్లు ఇప్పించండి
author img

By

Published : Apr 12, 2021, 4:37 PM IST

తూర్పు డెల్టాకు ఏప్రిల్ 15 వరకు, మధ్య డెల్టాకు ఏప్రిల్ 20 వరకు సాగునీటి అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు నివేదిక ఇచ్చామని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు తెలిపారు. సాగునీటి సలహా మండలిలో తీర్మానించిన మేరకు మార్చి 31న కాలువలుకు నీటి విడుదల ఆపేసి.. జూన్ 1న మళ్లీ విడుదల చేయాలి.

అయితే... మధ్యలో రబీ వరి కోతలు నామమాత్రంగా మొదలయ్యాయి. అక్కడక్కడ ఇంకా చేలు ఇప్పుడే ఎదుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో... గింజ గట్టిపడే దశకు నీరు అధికంగా అవసరం ఉంటుంది. కాబట్టి తూర్పు డెల్టాకు ఏప్రిల్ 15 వరకు, మధ్య డెల్టాకు​ 20 వరకు నీటిని విడుదల చేయాలని కోరినట్లు అధికారులు మంత్రికి వివరించారమని అన్నారు.

ఇదీ చదవండి:

కాకినాడలో తాగునీటి కష్టాలు.. నీరందక నగరవాసుల ఇక్కట్లు

కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.