రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి నాసిరకం ఇసుక సరఫరా అయింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో మంత్రి విశ్వరూప్ ఇటీవల సొంతింటి నిర్మాణం ప్రారంభించారు. అందుకోసం ఆన్లైన్లో ఇసుక బుక్ చేశారు. శుక్రవారం ఉదయం నాలుగు లారీల ఇసుక వచ్చింది. అది మట్టితో కూడిన తువ్వ ఇసుక కావటంతో నిర్మాణ పనులు చూసుకునే అల్లాడ వెంకటరమణ మంత్రికి చెప్పారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి... వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అందరికీ నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలన్నారు. దీంతో అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ శుక్రవారం భట్నవిల్లి వెళ్లి ఇసుకును పరిశీలించారు. ఆయనతో పాటు పంచాయతీరాజ్ ఇంజనీర్ రాంబాబు ఇసుకను పరిశీలించారు. అది ఇంటి నిర్మాణానికి పనికిరాదని చెప్పారు.
ఇదీ చదవండి