కరోనా కారణంగా పేదలు కనీసం కడుపు నింపుకోవడమే కష్టంగా మారింది. ఓవైపు వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుంటే మరోవైపు తినడానికి తిండి దొరకని వారి సంఖ్యా పెరుగుతోంది. నిత్యం వివిధ రకాల పనులు చేసుకునే వారికి ఉపాధి కరువై పోవడంతో భోజనం పెట్టే దాతల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్ వద్ద గురువారం సాయంత్రం అలాంటి దృశ్యాలే కన్పించాయి. ఓ దాత పంచుతున్న ఆహారం కోసం ఆ ప్రాంతాల్లో ఉంటున్న పేదలు, ఉపాధి కోల్పోయినవారు, అనాధలు, ఒంటరిగా ఉంటున్న వారు భోజనం కోసం ఎగబడ్డారు. క్యూలైన్లలో నిలబడి దాత ఇచ్చిన ఆహారాన్ని అందుకుని కడుపు నింపుకుంటున్నారు. అందని వారు మాత్రం ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి గోదావరి గట్టు వెంబడి నిత్య ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తూనే ఉన్నాయి.
ఇవీ చదవండి: కొత్తపేట నియోజకవర్గంలో పెరుగుతోన్న కరోనా కేసులు