ETV Bharat / state

చిట్టిదూడ హొయలు... చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు - ఎత్తు తక్కువతో ముద్దు గొలుపుతున్న పుంగనూరు పెయ్య

ఆవుదూడలు కళ్లెదురుగా గంతులు వేస్తుంటే అదో రకమైన సంతోషం. అప్పుడే పుట్టిన దూడ.. అందునా 13.5 అంగుళాల పెయ్యను చూస్తుంటే ఆ ఆనందం వర్ణించలేనిది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం పడమటిపాలెంలో పుట్టిన ఆ చిన్న దూడను చూసేందుకు పలువురు తరలి వస్తున్నారు.

low height cow calf, cow gave birth to low height calf in padamatipalem
పడమటిపాలెంలో తక్కువ ఎత్తుతో పుట్టిన ఆవు దూడ, ఎత్తు తక్కువ చిట్టిదూడ జననం
author img

By

Published : Apr 18, 2021, 7:19 PM IST

ముద్దుగొలుపుతున్న పుంగనూరు పెయ్య

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం పడమటిపాలెంలో.. ఓ రైతుకు చెందిన పుంగనూరు ఆవుకు 13.5 అంగుళాల ఎత్తున్న బుల్లి దూడ పుట్టింది. చూసేందుకు ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ దూడ.. కేవలం 13.5 అంగుళాల ఎత్తు, 22 అంగుళాల పొడవు మాత్రమే ఉంది. గుండబత్తుల మధుకు చెందిన ఆవుకు పుట్టిన ఈ పెయ్యదూడను చూసేందుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇదీ చదవండి: 'అలవట్టం' రూపొందిస్తూ 50 ఏళ్లుగా దైవసేవలో..

మధుకు చిన్నప్పటి నుంచి ఆవుల పెంపకం అంటే ఇష్టం. అతడు ప్రస్తుతం సుమారు 12 గోవులను పెంచుతున్నాడు. తన వద్ద ఉన్న మరో ఆవుకు.. ఏడాది క్రితం 15 అంగుళాల దూడ పుట్టిందని మధు చెప్పాడు. ఆవుకు ఇంత చిన్న దూడ పుట్టడం చాలా అరుదు అంటున్నాడు. పుంగనూరు ఆవు ఎత్తు ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుందని చెబుతున్నాడు. ఈ దూడ ధర రూ. 4 లక్షలకు పైనే ఉంటుందని పేర్కొంటున్నాడు.

ఇదీ చదవండి:

పుష్కరకాలంగా రాములోరి తరుపున సీతమ్మకు కంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.