యానాంలో పుదుచ్చేరి ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణ పనులను.. మంత్రి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. 2019 ఫిబ్రవరిలో ఈ కాలేజీకి ప్రధానమంత్రి ఆన్లైన్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. అయితే నిధుల విడుదలలో జాప్యంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు నిధులు మంజూరైనందున హైదరాబాద్కు చెందిన గుత్తేదారు పనులు ప్రారంభించారు.
పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి కృష్ణారావు నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులు, గుత్తేదారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును ఈ కాలేజీకి పెట్టాలని మంత్రివర్గానికి ప్రతిపాదించగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.
ఇవీ చదవండి..