ETV Bharat / state

'సెల్​టవర్ నిర్మాణాన్ని ఆపి పక్షుల ప్రాణాలు కాపాడండి' - తూర్పుగోదావరి జిల్లా పుణ్యక్షేత్రం

తూర్పుగోదావరి జిల్లా పుణ్యక్షేత్రం గ్రామానికి ఏటా విదేశీ పక్షులు వస్తుంటాయి. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి, సంతానోత్పత్తి చేసుకుని స్వదేశానికి పయనమవుతాయి. ఈ క్రమంలో పుణ్యక్షేత్రంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు తగిలి భారీ సంఖ్యలో విహంగాలు మృత్యువాత పడుతున్నాయి. ఇదే కాకుండా... ఈ ప్రాంతంలో సెల్​టవర్ నిర్మించాలన్న అధికారుల నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, పక్షుల ప్రాణాలు కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలంటూ పుణ్యక్షేత్రంలో నిరసన
author img

By

Published : Oct 22, 2020, 7:46 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామానికి ఏటా వేలాది మైళ్లు ప్రయాణించి, పక్షులు వలస వస్తుంటాయి. జూన్ నెలలో వచ్చి, సంతానోత్పత్తి చేసుకుని డిసెంబర్​లో తమ దేశానికి తిరుగు పయనమవుతాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వీటిని స్థానికులు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఈక్రమంలో ఈ ప్రాంతంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయటంతో... స్వేచ్ఛగా విహరించే విహంగాలు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా వీటి సంఖ్య భారీగా తగ్గుతోంది.

సెల్ టవర్ నిర్మాణానికి తీవ్ర వ్యతిరేకత...

ఈ క్రమంలో... ఇదే ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలన్న అధికారుల నిర్ణయంతో, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల్లో టవర్ నిర్మిస్తే... తమకు, పక్షులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... గ్రామ సచివాలయ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఈ విషయంపై అధికారులు స్పందించి, టవర్ నిర్మాణాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.

సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలంటూ పుణ్యక్షేత్రంలో నిరసన
సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలంటూ పుణ్యక్షేత్రంలో నిరసన

ఇదీచదవండి.

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఈనెల 23నాటికి తీరం దాటే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.