ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ కు ప్రధాని నరేంద్ర మోదీ రాజమహేంద్రవరం రత్నం పెన్నును బహూకరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేవీరత్నం మొదటగా ఈ పెన్నులను తయారుచేశారు. మనం వాడే వస్తువుల్లో స్వదేశీ తయారీ మాత్రమే ఉండాలన్న గాంధీజీ పిలుపు మేరకు కేవీ ఈ కలాన్ని తయారుచేసి... గాంధీకి ఇచ్చారు. ఈ కలం విదేశీ పెన్నులకు దీటుగా ఉందని.. రత్నాన్ని కొనియాడుతూ అప్పట్లో గాంధీ లేఖ రాశారు. అప్పటి నుంచి ఎందరో ప్రముఖులు ఈ కలాన్నే వాడేవారు. ప్రధాని బహుమతిగా ఈ పెన్ను ఇవ్వటంతో తమ సంస్థ ఇంకు పెన్నులు.. స్వదేశీ వస్తువులుగా ఖ్యాతి చెందడం అదృష్టంగా భావిస్తున్నామని తయారీదారు కేవీ రమణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: