ETV Bharat / state

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వారోత్సవాలు

ప్రధాన మంత్రి జన్మదిన వారోత్సవాలు పలు జిల్లాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భాజపా నేతల ఆధ్వర్యంలో ఒకచోట పేదలకు పండ్లు, మాస్కులు అందించగా.. మరోచోట రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

prime minister birth day week celebrations
మోదీ జన్మదిన వారోత్సవాలు
author img

By

Published : Sep 16, 2020, 5:46 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో..

ప్రధాన మంత్రి మోదీ జన్మదిన వారోత్సవాల సేవా సప్తాహ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మాధవపట్నంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజల ఆధ్వర్యంలో... పేదలకు పండ్లు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ.. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాపించేలా మోదీ చేసిన సేవ అనితర సాధ్యమని అన్నారు.

విశాఖ జిల్లాలో..

నర్సీపట్నంలో మోదీ జన్మదిన వారోత్సవాలను నిర్వహించారు. భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని.. ఎమ్మెల్సీ మాధవ్ ప్రారంభించారు. మోదీ భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మహానీయుడని మాధవ్ అన్నారు. కింది స్థాయి నుంచి.. ప్రధాని స్థాయికి మోదీ ఎదిగారని గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి: పొంగుతున్న వాగులు.. నిలిచిన వాహనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.