తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
యానాం ప్రభుత్వ అతిథి గృహం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి.. గిరింపేట గ్రామంలో జూనియర్ కళాశాల భవనం ప్రారంభించి మొక్కలు నాటారు. విద్యార్థులకు అల్పాహారం పథకం, గోపాల్ నగర్లో నిర్మించిన నూతన అంబేద్కర్ విజ్ఞాన భవన్‌ను ప్రారంభించారు. అదే ప్రాంగణంలోని సమావేశ మందిరంలో యానాంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇదీ చదవండి: