కరోనా బాధితులను పోలీసులు, వైద్యులు చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు. ఇదంతా ఆ బాధితులు కరోనాతో పోరాడి గెలిచినందుకు అభినందనగా ఈ పని చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో జరిగింది.
కత్తిపూడి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. బాధితులు నలుగురికి రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం మరోసారి వారి నమూనాలు పరీక్షించగా... నెగెటివ్ రావటంతో వారిని డిశ్చార్జ్ చేశారు.
చప్పట్లు కొడుతూ ఆహ్వానించిన పోలీసులు, వైద్య సిబ్బంది
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి అర్ధరాత్రి కత్తిపూడి చేరుకున్న ఆ నలుగురిని పోలీసులు, వైద్య సిబ్బంది చప్పట్లు కొడుతూ ఆహ్వానించారు. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకూడదని పోలీసులు సూచించారు. వీలైనంత వరకూ భౌతిక దూరం పాటించాలన్నారు.
ఇదీ చదవండి: ఆకలి ముందు.. తెలియని కాళ్ల మంటలు