ETV Bharat / state

kidnap case: బాలిక అపహరణ కేసును ఛేదించిన జీఆర్​పీ పోలీసులు - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు

రైలులో ప్రయాణిస్తున్న 18నెలల బాలిక అపహరణ(child kidnap) కేసును రాజమహేంద్రవరం జీఆర్​పీ పోలీసులు ఛేదించారు. బాలికను అపహరించిన నామవరం శాటిలైట్ సిటీకి చెందిన భవానీ, సూత్రదారులు రామకృష్ణ, వెంకట రత్నంలను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలిక అపహరణ కేసును చేధించిన జీఆర్​పీ పోలీసులు

author img

By

Published : Oct 16, 2021, 7:39 PM IST

రైలులో ప్రయాణిస్తున్న 18నెలల బాలిక అపహరణ(child kidnap) కేసును రాజమహేంద్రవరం జీఆర్​పీ పోలీసులు ఛేదించారు. బాలికను అపహరించిన నామవరం శాటిలైట్ సిటీకి చెందిన భవానీ, సూత్రదారులు రామకృష్ణ, వెంకట రత్నంలను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలు లేని వారికి అమ్మేసి సొమ్ము చేసుకునేందుకు బాలికను అపహరించినట్టు పోలీసులు తేల్చారు. గత నెల 30న ఒడిశాకు చెందిన దంపతులు వారి పిల్లలతో సహా విశాఖ-కాచిగూడ రైలులో సికింద్రాబాద్ వెళ్తున్నారు.

వీరితోపాటు నిందితురాలు భవానీ కూడా రైలులో ప్రయాణించింది. రైలులో నిద్రిస్తున్న 18 నెలల చిన్నారిని భవాని ఎత్తుకొని రాజమహేంద్రవరం స్టేషన్​లో దిగింది. పాపను తీసుకొని వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించి...నిందితుల్ని పట్టుకున్నారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. జీఆర్​పీ డీఎస్పీ నాగేశ్వరరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఇదీ చదవండి:

RK funeral photos: ఆర్కే అంత్యక్రియలు పూర్తి.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.