ETV Bharat / state

DUPLICATE OFFICER: పగలు కారు డ్రైవర్.. రాత్రి..! - అమలాపురం నేర వార్తలు

పగలు డ్రైవర్​గా పని చేస్తూ.. రాత్రిళ్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా అవతాారమెత్తి ప్రజల నుంచి నగదు వసూలు చేస్తున్నాడు. ఇలా ఓ ఆటో డ్రైవర్ వద్ద డబ్బులు తీసుకోగా..ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది.

police arrest  fake officers at amalapuram
అమలాపురంలో నకిలీ అధికారుల అరెస్ట్
author img

By

Published : Jul 21, 2021, 12:53 PM IST

Updated : Jul 21, 2021, 1:31 PM IST

ఓ వ్యక్తి వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయానికి అద్దెకు కారు తిప్పుతూ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఈ విధంగా అధికారులతో వెళ్లినపుడు అధికార దర్పం ఎలా ఉంటుందో తెలుసుకుని.. ఇక నకిలీ అధికారిగా అవతారమెత్తాడు. మరో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకుని.. అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు గుంజుతున్నారు. ముగ్గురు నకిలీ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది.

అమలాపురానికి చెందిన కొప్పర్తి వీర షణ్ముఖం వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయానికి కారును అద్దెకి తిప్పుతూ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. పగలంతా విధులు నిర్వహిస్తూ రాత్రి సమయంలో నకిలీ అధికారిగా అవతారమెత్తి.. అమాయకులను దోచుకుంటున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కాగితపల్లి శివన్నారాయణ, పాలగుమ్మి సూరిబాబు ఇలా ముగ్గురూ కలిసి ప్రజల వద్ద నగదు వసూలు చేస్తున్నారు.

గత నెల 24న ఈ ముగ్గురు.. విజిలెన్స్ అధికారులమంటూ ఆటోను ఆపి ఆటో డ్రైవర్ స్వరూప కుమారి నుంచి రూ.5వేలు దోచుకున్నారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నిఘా పెట్టి వారిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి కారును స్వాధీనం చేసుకున్నామని సీఐ షేక్ బాజీ లాల్ తెలిపారు

ఇదీ చూడండి.

tax: 'పన్నుపోటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకూ పోరాటం'

Last Updated : Jul 21, 2021, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.