తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యుడు పెండెం దొరబాబు... రెండు రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్థరణ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్‌గా ఫలితం వచ్చింది.
ఈ క్రమంలో దొరబాబును కాకినాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స అవసరమన్న వైద్యుల సూచనతో దొరబాబును కాకినాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు తరలించారు. ఆయన వెంట కుటుంబీకులూ వెళ్లారు.
ఇదీ చూడండి:
మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తారా?: యనమల