తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలో.. 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నూతన భవనాలు, ఇతర వసతుల కోసం 15 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ పనుల కోసం టెండర్లు పిలిచినట్లు రహదారులు భవనాల శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ నాయక్ వెల్లడించారు.
టెండర్ల ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. అమలాపురం డివిజన్ లో వీరవల్లిపాలెం, అయినవిల్లి, ముక్కామల, అంబాజీపేట, నాగుల్ లంక, బండారులంక, భీమనపల్లి ,గోడిలంక, ఊబలంక, పేరూరు, నగరం ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో 32 చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: