తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో దీపావళి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. అమలాపురం డివిజన్లోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు తాత్కాలికంగా అనుమతులు ఇచ్చారు.
అనుమతులతో దుకాణాలు ఏర్పాటు..
అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్ అధికారుల అనుమతులు తీసుకుని వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేశారు. డివిజన్ పరిధిలోని కొత్తపేట, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాల పరిధిలోని 225 దుకాణాలకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
కొత్తపేటలో 39, రాజోలులో 72, అమలాపురంలో 52, ముమ్మిడివరం అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 62 దుకాణాలను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి