తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి శాంతించినా... నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముంపు ఇంకా తగ్గలేదు. వారం రోజులుగా హెచ్చుతగ్గులతో వరద నీరు గ్రామాలు, పంట పొలాల మీద ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కేంద్రపాలిత యానాంలో గౌతమి గోదావరి ఉగ్ర రూపానికి రెండు వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వీరందరికీ స్వచ్ఛంద సేవా సంస్థలు మూడు పూటలా ఆహారం అందిస్తున్నాయి. ఒక్కో ఇంటికి 40 లీటర్ల చొప్పున టిన్నుల ద్వారా తాగునీటిని అందజేస్తున్నారు.
ఇదీ చదవండి