తూర్పుగోదావరి జిల‌్లా పి.గన్నవరంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద శుక్రవారం రాత్రి ప్రజలు నిరసనకు దిగారు. స్థానిక జిల్లాలోని పోతవరం, గణేష్ నగర్ వద్ద 8 నెలలుగా నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారుల తీరుపై, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా... సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో... సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నామని, ట్రాన్స్కో ఏఈ, జీవి ఆచార్యులు ఆందోళనకారులకు వివరించారు.
ఇవీ చూడండి