ETV Bharat / state

బొమ్మ గీస్తే.. శభాష్ అనాల్సిందే.. - news on rajamundry artistharshith

సినీ నటులు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, తెలిసిన వారు ఇలా ఎవరి ముఖ చిత్రమైనా అయినా సరే టక్కున గీసేస్తాడు. అది చూసిన వారు సంబర పడాల్సిందే. చిన్నప్పటి నుంచి ఎలాంటి శిక్షణ లేకుండా తోచిన రీతిలో బొమ్మలు గీస్తూ ఎదిగిన ఆ కుర్రాడు... నేడు సెలబ్రీటీలతోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు. చదువులోనూ తనకి ఇష్టమైన ఆర్కిటెక్చర్ రంగాన్ని ఎంచుకొని ప్రతిభ చాటుతున్నాడు. పెన్సిల్ స్కెచింగ్ కళలో అద్భుతాలు సృష్టిస్తున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కుర్రాడిపై కథనం.

pencil sketch artist at rajamundry
బొమ్మ గీస్తే.. శభాష్ అనాల్సిందే..
author img

By

Published : Jul 18, 2020, 7:01 AM IST

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ములల్లంకకు చెందిన పోలిన హర్షిత్ శ్రీ వాస్తవ కుటుంబం రాజమహేంద్రవరంలో నివాసం ఉంటోంది. శ్రీ వాస్తవకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే ఆసక్తి. తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఏ ఆకృతి చూసినా.. ఇంటికి వచ్చి కాగితాలపై ఇట్టే గీసేవాడు. కుమారుడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్వరూప, సత్యనారాయణ ప్రోత్సహించారు. ఖాళీ దొరికినప్పుడల్లా బొమ్మలు గీస్తూ చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్నాడు హర్షిత్. రెండేళ్ల నుంచి సెలబ్రిటీలు, సినీ నటులు, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రముఖుల ముఖ చిత్రాలు తీర్చిదిద్దాడు హర్షిత్.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని వాజ్ పేయి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సినీ నటులు చిరంజీవి, మహేష్ బాబు, అమీర్ ఖాన్, బ్రహ్మానందం, నాని, సమంత, దర్శకుడు రాజమౌళి ముఖ చిత్రాలు అచ్చు గుద్దినట్టు దింపేశాడు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా, రిలయన్స్ ముఖేష్ అంబానీ, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ఇషా ఫౌండేషన్ ఛైర్మన్ జగ్గీ వాసు దేవ్, శాస్త్రవేత్త హాకిన్స్ వంటి ప్రముఖుల ఫొటోలు సైతం విశేషంగా ఆకట్టుకునేలా రూపొందించాడు హర్షిత్. ఇప్పటి వరకు 295 మంది ఫొటోలు పెన్సిల్ ద్వారా తీర్చిదిద్దడం ఈ కుర్రాడి ప్రత్యేకత.

ఈ యువకుడు రూపొందించిన మహేష్ బాబు ముఖ చిత్రం....సూపర్ స్టార్ ని విశేషంగా ఆకర్షించింది. సింగపూర్ కు చెందిన మేడమ్ టూసార్ట్స్ మహేష్ బాబు మైనపు బొమ్మ రూపొందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో హర్షిత్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. ఆయన అభినందనలు హర్షిత్ కు లభించాయి. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యను కూడా స్వయంగా కలిసి ఆయన ముఖ చిత్రం బహూకరించారు. చిత్రలేఖనంలో అద్భుతాలు సృష్టిస్తున్న హర్షిత్ తనకు ఇష్టమైన ఆర్కిటెక్చర్ రంగాన్ని ఎన్నుకున్నాడు. బెంగళూరులోని క్రైస్ట్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఎంచుకున్న కోర్స్ లోనూ రాణిస్తున్నాడు. ఆర్కిటెక్చర్ పోటీల్లో హైదరాబాద్ లో నిర్మించే ఎత్తైన భవంతికి రూపకల్పన చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించేలా సిద్ధమవుతున్నాడు.

అసోం వరదల సమయంలో మూడు జంతువుల చిత్రాలు గీసి...వాటిని విక్రయించి వరద సాయం అందించాడు హర్షిత్. హర్షిత్ ముఖ చిత్రాలకు ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ చిత్ర కళతోపాటు పర్యావరణ హిత ఆర్కిటెక్చర్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఈ యువకుడి ఆశయం.

ఇదీ చదవండి: మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.