దిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... రేపు ఉదయం 11 గంటలకు విశాఖ రానున్నారు. విశాఖ నుంచి నేరుగా కాకినాడ వెళ్లనున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఆదివారం జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. జనసేన కార్యకర్తలపై ద్వారంపూడి అనుచరులు, వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్... కాకినాడ వస్తున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు.
ఇదీ చదవండి :