ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కాకినాడ... వైకాపా, జనసేన శ్రేణుల మధ్య ఘర్షణతో వేడెక్కింది. పవన్‌కల్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్న జనసైనికులు, వీరమహిళలపై వైకాపా శ్రేణుల దాడి... హింసకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతూ... తాము ఎమ్మెల్యే ఇంటివైపు ర్యాలీగా వెళ్లామని... తీరా వాళ్లు అక్కడికి వెళ్లేసరికి.. వైకాపా శ్రేణులు తమపై దాడి చేశారని జనసైనికులు, వీరమహిళలు ఆరోపించారు.
ముందుగానే ప్రణాళిక...
రాళ్లు, కర్రలతో వైకాపా శ్రేణులు రెచ్చిపోయారని వీరమహిళలు పేర్కొన్నారు. అసభ్యపదజాలంతో తమపై చేయిచేసుకున్నారని వాపోయారు. దాడి జరిగిన విధానం చూస్తుంటే ముందుగానే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్, వైకాపా ఎమ్మెల్యేలు క్షమాపణ కోరాలని జనసేన నేతలు, దాడిలో గాయపడినవారు డిమాండ్ చేశారు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగితే ప్రభుత్వం స్పందించటం లేదని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: