రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ సామాజక దూరం పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాదారులు తమ దుకాణం ముందు సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిబంధనలను పాటించని దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి.