గోదావరికి వరద తగ్గినట్లే తగ్గి మరోసారి పెరగటంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని గౌతమి వశిష్ఠ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి వంతెనల వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. జొన్నాడ వంతెన సమీపంలో ఉన్న దేవాలయాల్లోకి నీరు చేరింది. సమీపంలో ఉన్న పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని పిచ్చుకలంక నీట మునిగింది.
ఇదీ చూడండి